వైసీపీ అడ్డాగా టికెట్లు అమ్ముకున్నారు: మంత్రి

వైసీపీ అడ్డాగా టికెట్లు అమ్ముకున్నారు: మంత్రి

AP: టీటీడీని వైసీపీ పార్టీ అడ్డాగా మార్చుకుని టికెట్లు అమ్ముకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తిరుమల ప్రతిష్టను పూర్తిగా దిగజార్చించిందే వైసీపీ అంటూ మండిపడ్డారు. వాళ్లు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే టీటీడీ ఆస్తులను వేలం వేయాలని ప్రయత్నించారని అన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.