మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నీలం యాదగిరి
సిద్దిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడిగా నీలం యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కిష్టయ్య, కార్యదర్శిగా నాయకం సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా చెంది సత్యనారాయణ, కోశాధికారిగా కేఆర్.సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.