మంగళగిరిలో పాఠశాలలకు రూ.33 లక్షలు విలువైన సామగ్రి పంపిణీ
GNTR: మంగళగిరి మండలంలోని 13 పాఠశాలలకు టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సి.ఎస్.ఆర్. కార్యక్రమం కింద రూ.33 లక్షల విలువైన ఫర్నిచర్, క్రీడా, వంట సామగ్రి అందజేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, టయోటా అధికారులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత పాల్గొనాలని సూచించారు.