పుకార్లకు చెక్.. ఖమేనీ వీడియో రిలీజ్
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఆ దేశ అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. అలీ ఖమేనీ మరణ వార్తల తర్వాత మొజ్తాబా తొలిసారి ఇందులో దర్శనమిచ్చారు. ఆయన మతబోధనలు చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియో ఎప్పటిదనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆయన క్షేమంగానే ఉన్నారని చాటిచెప్పేందుకు ఇరాన్ ఈ వీడియో రిలీజ్ చేసింది.