రైతు బజార్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో వున్న రైతు బజార్‌ను బుధవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్రజలకు రైతు బజార్‌లో నిత్యవసరాలు అందజేయాలని ఎమ్మెల్యే తెలిపారు.