ఘనంగా జగన్నాథ స్వామి రథయాత్ర

SKLM: సోంపేట మండలం బారువా గ్రామంలో శుక్రవారం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా మొదలై రాత్రి 10 గంటల వరకు సాగింది. ఈ మేరకు ఉదయం విశ్వకర్మ పూజ, సుదర్శన హోమము, విశేష పూజలు చేశారు. అలాగే రథయాత్రలో భాగంగా చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది.