కందగిరి జాతర నిర్వహణపై అధికారులకు సూచనలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులోని కందగిరి జాతర ప్రాంతాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదివారం పరిశీలించారు. జాతర ఏర్పాట్లపై పార్కింగ్, త్రాగునీరు, శాచాల్లు, భద్రత, వైద్యసౌకర్యాలు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సూచికలు, సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.