BR నాయుడు తప్పులపై పోరాటం చేస్తాం: భూమన

AP: TTD ఛైర్మన్ BR నాయుడు తప్పులపై పోరాటం కొనసాగిస్తామని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. బోర్డు ఛైర్మన్ మాటలకు, పనులకు సంబంధం లేదని విమర్శించారు. విదేశాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలకు ధరలు పెట్టారని అన్నారు. కళ్యాణోత్సవాలను వ్యాపారంగా మార్చారు అని మండిపడ్డారు. దేవస్థానం బోర్డులో ఉన్న ఆచారాలను, నిబంధనలను పాటించడం లేదని, వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.