VIDEO: ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
ప్రకాశం: ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) బుచ్చి శాఖ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎనలేనిదని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.