VIDEO: వారణాసి షూటింగ్ సెట్స్ చూశారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ సినిమా 'వారణాసి'. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. వారణాసి ఘాట్లు, ఆలయాలు, వీధులను అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.