మహిషాసుర మర్దినిగా శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం MBT రోడ్డు వద్దగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం అమావాస్య పూజలు అందుకుంది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించారు. తర్వాత కాటుక, కుంకుమతో మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించారు. మారెమ్మను భక్తులు దర్శించగా, మహిళలు ఆలయావరణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.