భావనపాడు బీచ్‌లో పర్యాటకులు సందడి
SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రపు బీచ్‌లో పర్యాటకుల సందడి ఆదివారం నెలకొంది. సెలవుదినం కావడంతో మండలంలో ఉన్న విద్యార్థులతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. కొన్ని కుటుంబాల సైతం ఇక్కడికి వచ్చి పిక్నిక్ నిర్వహిస్తుంటారు. జీడిమామిడి సరుగుడు తోటలు దట్టంగా ఉండడం వలన పిక్నిక్ స్పాట్‌గా ఎంచుకొని విందు ఆరగిస్తారు.