రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు

VZM: కొత్తవలస రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఎస్సై హేమంత్ కుమార్, సిబ్బందితో శనివారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో సరైన వాహన పత్రాలు ఉండాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్ చేయరాదని కోరారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలని చిరు వ్యాపారస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శిరస్త్రాణం లేని వారిపై జరిమానా విధించారు.