మహిళపై దాడి.. కేసు నమోదు
KRNL: పెద్దకడబురు మండలంలో చిన్నతుంబలంలో బుడిజగ్గుల లక్ష్మి (24)పై గత రాత్రి దాడి జరిగింది. లక్ష్మీ ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన రాజు(ఇసాక్) పాత గొడవల నేపథ్యంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి కాళ్లు, చేతులతో దాడి చేసి అసభ్యంగా దూషించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పెద్దకడబూరు PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంచినట్లు SI తెలిపారు.