సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేయించారు. దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.