కుక్కల బెడదతో హడలెత్తుతున్న ప్రజలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కుక్కల బెడదతో ప్రజలు హడలెత్తుతున్నారు. అధికారులు ఉన్న కేవలం పన్నుల వసూళ్లకు మాత్రమే వీధుల్లోకి వస్తున్నారు తప్పా తమ సమస్యలు మాత్రం గాలికి వదిలేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ బండ్ల సీట్లు కవర్లను సైతం కుక్కలు కొరుకు తింటున్నాయని అంటున్నారు. ఇక పిల్లలపై మీద కుక్కలు దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆరోపిస్తున్నారు .