రేపే ఆఖరు.. రెండో రోజు 4,901 నామినేషన్లు
TG: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు సర్పంచ్ పదవులకు 4,901 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం 8,198 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. వార్డు సభ్యులకు 11,502 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 4,236 సర్పంచి, 37,440 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది.