వాహనాల తనిఖీ చేపట్టిన డీఎస్పీ

వాహనాల తనిఖీ చేపట్టిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని చెక్ పోస్ట్ వద్ద డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెంచామని డీఎస్పీ తెలిపారు. కొన్ని రోజులపాటు ఈ తనిఖీలు కొనసాగుతాయి అన్నారు.