ఈ నెల 23న ఆదివాసీ ధర్మయుద్ధం
ADB: లంబాడాలను ST జాబితా నుండి తొలగించాలనే డిమాండ్‌తో ఆదివాసులు నవంబర్ 23న ఉట్నూర్‌లో ధర్మయుద్ధం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆదివాసి సేన జిల్లా అధ్యక్షుడు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సార్మేడి కోట్నక దేవ్ షావ్ మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో ఆదివాసులు ఈ సభకు హాజరు కావాలని.. ఈ సభ ద్వారా తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొన్నారు.