నేడు నరసింహకొండ బ్రహ్మోత్సవ కార్యక్రమాలివే..

NLR: రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు చప్పర ఉత్సవం, ధ్వజరోహణం, రాత్రి 8 గంటలకు శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.