Groww మాతృసంస్థ IPOకు భారీ స్పందన
స్టాక్ బ్రోకింగ్ సంస్థ Groww మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ IPO సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. చివరి రోజుకు ఈ పబ్లిక్ ఇష్యూకు 17.6 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది. మొత్తం రూ.6,632 కోట్ల ఇష్యూలో భాగంగా ధరల శ్రేణిని రూ.95-100గా నిర్ణయించారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కోటా 22.02 రెట్లు స్పందన అందుకుంది.