నేడు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

నేడు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, బాపట్ల జిల్లాల్లో శనివారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ శుక్రవారం తెలిపారు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు 41°C నుంచి 42.5°C వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, ఈదురుగాలులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.