సీఎం చదువుకున్న పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.50 కోట్లు: ఎమ్మెల్యే

సీఎం చదువుకున్న పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.50 కోట్లు: ఎమ్మెల్యే

WNP: సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లతో నూతన భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తిలో ఉన్న చారిత్రక రాజభవనం నిర్మాణ శైలిని పోలి ఉంటుందన్నారు.