వైసీపీ నేతల ఇంటింటి ఎన్నికల ప్రచారం

వైసీపీ నేతల ఇంటింటి ఎన్నికల ప్రచారం

తూ.గో: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీకి ప్రజలు అండగా నిలవాలని జిల్లా వక్ఫ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ సజ్జాద్ హుస్సేన్ కోరారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో వైసీపీ నేతలు ఆదివారం ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతిగా ప్రాచుర్యం పొందారన్నారు. ఈ ప్రచారంలో నూరైన్, బాకర్ హుస్సేన్ పాల్గొన్నారు.