నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NTR: విద్యుత్ లైన్లకు మరమ్మత్తుల కారణంగా బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ముత్యాలంపాడు సెక్షన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత ఉంటుందని ఏఈఈ బి. వెంకటస్వామి తెలిపారు. 11 కేవీ కేదారేశ్వరపేట ఫీడర్ పరిధిలోని లోటస్ ల్యాండ్ సెక్టార్-1, మెయిన్ రోడ్డు, కేదారేశ్వరపేటలోని ఒకటి నుంచి ఏడవ లైన్లలో సరఫరా ఉండదు. స్థానికులు సహకరించాలని ఏఈఈ కోరారు.