రేపు సూర్యపేటలో ఈ ప్రాంతాల్లో పవర్ కట్
SRPT: రేపు ఉదయం 9 గంటల- మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల కారణంగా సూర్యపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు TGSPDCL అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ కాలనీ, NTR కాలనీ,సైనిక్‌పురి, సీతారాంపురం, నాగులమ్మగుడి, మామిళ్లగడ్డ, రెడ్డి హాస్టల్, కస్తూరి బజార్, ప్రియాంక కాలనీ, ఏరియా హాస్పిటల్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.