పలిగిన పైప్ లైన్.. ఇబ్బందిపడుతున్న ప్రజలు

పలిగిన పైప్ లైన్.. ఇబ్బందిపడుతున్న ప్రజలు

BHPL: రేగొండ మండలం రావులపల్లి గ్రామంలోని మిషన్ భగీరథ గేట్‌వాల్స్ సమీపంలో కొద్ది రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయింది. తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ వద్ద నీరు నిలిచి దుర్వాసన వ్యాపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఇవాళ కోరారు.