రేపు జిల్లాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు: కలెక్టర్
కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరుకావాలని ఆమె కోరారు.