'యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలి'
NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఇతర పీజీ కోర్సులకు సంబంధించిన మిగిలిన సీట్లను భర్తీ చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి గురువారం వినతి పత్రం అందజేశారు. 200 పైగా ఖాళీలను భర్తీ చేయాలన్నారు.