'ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలి'

MNCL: లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది కొరతతో మూడు మండలాల నుంచి వచ్చే ప్రజలకు వైద్యం అందడం లేదని తెలిపారు.