మాజీమంత్రి అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే
ATP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఖండించారు. మంగళవారం వైవిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో వైసీపీ నాయకులపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తుందన్నారు.