VIDEO: నర్సీపట్నంలో దగ్ధమైన కారు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలో శుక్రవారం ఉదయం పార్క్ చేసిన కారు దగ్ధమైంది. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.