VIDEO: జుజ్జూరులో నేల వాలిన మొక్కజొన్న
NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో బుధవారం కురిసిన భారీ వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ అకాల వర్షానికి చేతికి అందే దశలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన పంట కళ్లముందే నాశనం కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్థికంగా భారీగా నష్టపోయామని రైతులు అన్నారు.