వైసీపీ నేతలతో నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం
PLD: చిలకలూరిపేట వైసీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మాజీమంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి గుండెకాయ అన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 'మావిగన్' కారిడార్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ఎండగట్టాలన్నారు.