శిథిలావస్థలో కొడకంచి పశువైద్య ఉపకేంద్రం
జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని పశువైద్య సబ్‌సెంటర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. గోడలు, వరండా ధ్వంసం కావడంతో పశువులకు చికిత్స అందించడం కష్టమవుతోందని పాడి రైతులు వాపోతున్నారు. భవనం కూలిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.