VIDEO: 'సిండికేట్లుగా ఏర్పడి అక్రమ మైనింగ్ చేశారు'
ప్రకాశం: జీ.కొండూరు(మం)లో ఎస్సీలకు చెందిన 150 ఎకరాల అసైన్మెంట్ భూమిని అక్రమంగా తవ్వేసినట్లు వెలగలేరు గ్రామ దళితులు ఆరోపించారు. వంగూరి ప్రకాష్ రావు అనే రైతు తన ఎకరం పొలం అమ్మి కూతురి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కొందరు వ్యక్తులు సిండికేట్లుగా ఏర్పడి అక్రమ మైనింగ్ చేశారని ఆయన తెలిపారు. ఈ అక్రమ మైనింగ్‌తో తమ భూములు నాశనమయ్యాయని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.