ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
సత్యసాయి: రొద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ నరసింహులుపై ఎలుగుబంటి దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం పొలం పనుల కోసం వెళ్లిన నరసింహులు మొక్కజొన్న తోట వద్ద ఉండగా, అకస్మాత్తుగా తోటలో నుంచి వచ్చిన ఎలుగుబంటి ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.