కామారెడ్డిలో విద్యార్థులకు వైద్యపరీక్షలు

కామారెడ్డి మండల కేంద్రంలోని ST బాయ్స్ హాస్టల్‌లో శనివారం విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ చందన ప్రియ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్య సంరక్షణపై, సీజనల్ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.