VIDEO: వరి ధాన్యం ఆరబెట్టే యంత్రం ప్రారంభం
WNP: వనపర్తి మండలంలోని రైతుల కోసం చిట్యాల దగ్గర ఉన్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి మంజూరైన వరి ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో యంత్రం ట్రయల్‌ను పరిశీలించారు. యంత్రంలో తడిసిన ధాన్యాన్ని పోసి యంత్రం ఆరబెడుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.