ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ

MHBD: మరిపెడ బంగ్లా మున్సిపల్ నగర పాలక సంస్థ ఆవరణలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్‌ను జిల్లా కన్వీనర్ జనుక ఉప్పలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వివిధ రంగాల్లో కష్టపడి పనిచేస్తున్న కార్మికుల జీవితాలు ఇబ్బందిగా మారాయని తెలిపారు. కార్మికులకు సమాన వేతనం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.