మధిరలో అమల్లోకి సెక్షన్- 163
KMM: మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో నేటి నుంచి 13 వరకు సెక్షన్- 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని సీఐ రమేష్ తెలిపారు. ఐదుగురికి మించి గుంపులు, ఊరేగింపులు నిషేధమన్నారు. డబ్బు, మద్యం, ఉచిత కానుకలతో ఓటర్లను ప్రలోభపెట్టరాదని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.