ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన
పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..ఎ స్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని వివరించారు. సకాలంలో బాధితులకు పరిహారం కూడా చెల్లించడం లేదన్నారు.