రోడ్డును బాగు చేయండి: ప్రజలు

మన్యం: పార్వతీపురం నియోజకవర్గంలో కీలకమైన పులిగుమ్మి రోడ్డు దుస్థితి ఇది. ఆరేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో బందలుప్పి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర తారు ఊడి గుంతలమయంగా మారింది. వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.