VIDEO: కోతుల బెడదకు సర్పంచ్ వినూత్న పరిష్కారం
WGL: వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లిలో కోతుల బెడద తీవ్రంగా కొనసాగుతుండటంతో, సర్పంచ్ సునీత సమస్యకు వినూత్న పరిష్కారం సూచించారు. గురువారం గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరికి ఎలుగుబంటి వేషం ధరించి కోతులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ చర్యతో కోతులు తరిమివేయబడటంతో గ్రామస్తులు ఉపశమనం పొందారు. స్థానికులు ఈ వినూత్న ప్రయత్నాన్ని ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.