RAIN ALERT: ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.