తుఫాన్ బీభత్సం.. 85 మంది మృతి

తుఫాన్ బీభత్సం.. 85 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో కల్మేగి తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. ఈ విపత్తుతో ఇప్పటివరకు 85 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 75 మంది గల్లంతైనట్లు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వరదల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని.. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు చెప్పారు.