క్లిష్టమైన సర్జరీ పూర్తిచేసిన వైద్యులకు కలెక్టర్ విషెస్

క్లిష్టమైన సర్జరీ పూర్తిచేసిన వైద్యులకు కలెక్టర్ విషెస్

PDPL: జిల్లా ఆసుపత్రిలో అరుదైన లాప్రోస్కోప్ హిస్టరెక్టమీ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రశంసించారు. సుల్తానాబాద్‌కు చెందిన నిట్టూరి మానస అనే మహిళ గర్భసంచిలో ఉన్న కణతిని తొలగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్జరీలో పాల్గొన్న డా. స్రవంతి, డా.సాయి ప్రసాద్, డా.శ్రీధర్, తదితరులను ప్రశంసించారు.