ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్య..!!

ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్య..!!

ప్రపంచంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు సంచలన విషయాలను UNO తన నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన, రోజుకు సుమారు 137 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, భాగస్వాముల చేతిలోనే మహిళలు హత్యలకు గురవుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.