VIDEO: ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోయిన బస్సులు
KMR: ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బాన్సువాడ డిపో వద్ద నిన్న రాత్రి ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం, యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ ఉదయం నుంచే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేయబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో డిపో పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.