కర్నూలు చిన్నారికి అండగా నారా లోకేష్

కర్నూలు చిన్నారికి అండగా నారా లోకేష్

GNTR: కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలపాల్సిన ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు. దాతల సాయంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లను తాను ఏర్పాటు చేస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు.